• Home
  • EmergentRealism
  • Stories
  • New Story
  • Faint
  • Novels
  • Essays
  • Cincinnati Chronicles
  • Art Gallery
  • Contact Us
  • About Us
  • More
    • Home
    • EmergentRealism
    • Stories
    • New Story
    • Faint
    • Novels
    • Essays
    • Cincinnati Chronicles
    • Art Gallery
    • Contact Us
    • About Us
  • Home
  • EmergentRealism
  • Stories
  • New Story
  • Faint
  • Novels
  • Essays
  • Cincinnati Chronicles
  • Art Gallery
  • Contact Us
  • About Us

Emergent Realism

Emergent RealismEmergent RealismEmergent Realism

A New Literary Imagination

A New Literary ImaginationA New Literary Imagination

Faint - కాశీ మజిలీ కథలు

A New story by Bhaskar Pulikal

“FAINT

 

 

“I can be in any state; sometimes liquid, sometimes a gas and sometimes even solid. I am everywhere — inside a living being and outside it, inside an inanimate one like a rock and outside it, ever-pervading,” I said. 


“That still makes you a prisoner. You are incarcerated ever since those meteor showers hit the Earth,” replied the Faint voice, trying to dampen the euphoria bubbling from my pride.


I have seen Faint many times. Faint is not as densely built as I; he is the interstellar mist, the frozen wanderer riding on comets through the deep dark, ever-pervading this universe .Often I see faint traces but for sure, I know he exists.


“I am not a prisoner. I enjoy my life here which is over 3 billion years. I enjoy the color, hope, joy, tears and ultimately the life sustained by me. I think my life is better than the nomadic home you call the universe.”


“You are no different than me. I am water too.  We both are the same.”


“I don't believe it. I know I am distinct.”


“And you will eventually realize with the same conviction that we are one.  Because there is only One. Ask Mars, if you still cling to your separation."


“I am convinced. What Faint is telling is true. There is only one and the Faint is the One,” the Water on Mars buried deep under polar caps, piped in with  muffled, coarse voice acquired over tribulations and traumas spread over multiple eras. 


“But you are still speaking as an individual. It’s your distinct opinion,” I tried to jog the one, on Mars.


“I lost most of my body to merge with Faint. Whatever the remnants of the body,  left along with this soul is awakened. I  don't see the separation. I am convinced I am the extension of Faint.”


“I think the ravages you have undergone destroyed you and perhaps your thinking too. Your flourishing  rivers and  oceans-they all vanished with time. I am not surprised you acquired this distorted view and this distorted voice.” I thought I responded rationally. There was a lump in my throat.


“So, you think you are special! You will not undergo the same fate as your sibling on Mars?”


“I had my share of traumas. I went into extreme cold and froze at least five times during those ice ages. My BMI hasn't changed all over the 3 to 4 billion years that I recall of my existence - I am the same 1.4 billion cubic kilometers,” I quoted all the right numbers to  make it impossible to counter argue.


“Maybe you should recall the bruises and surgeries that you are forced to endure as a price for your existence. The rise and demise of dinosaurs for one.  You may not have noticed because of your size. But I saw traces of you escaping and joining me. And now there is a formidable foe on the horizon, who doesn't care for your existence.”


I thought before responding. “Guess you mean the human race. Yes, of late, I see the havoc they are playing with me.  All sorts of effluents released to hurt me in  whichever state I am, solid ice or water or vapor in air. But then I have an equally strong group of supporters who pray and fight to see that I am protected and relive my past glories.”


“So you believe humans in the long run are still your allies?”


“Yes. Why not? They can't survive without me.  I run through their body, nourishing them; helping organs function, make the brain think and help them ascertain their individuality. I help them to look good. And I even help them to clean up and get rid of their shitty byproducts of their existence. I have no doubt I will survive and  continue to live long after this race and this era vanishes.”


“So you think you have better odds than the fifty-fifty chance I gave you before joining me, thanks to humans?” said Faint.


“Yesss…” My shout slowly faded as I saw a human on the banks of a river. He was pouring dirt and filth into me. I looked at the human. He is the poster child of the movement to preserve me, the Water on earth.


I looked at Faint. He had a mischievous smile on his face.


I involuntarily chuckled…


A New story by Bhaskar Pulikal

కాశీ మజిలీ కథలు

   

“ఈ చిన్న పని చేయి నాన్న,” అమ్మ మాటలు వినిపిస్తున్నాయి, “మీ నాన్న నీకెంత చేశారు.”


నేను మౌనంగానే ఉన్నాను. అమ్మ మాటలు బాధ పెడుతూనే ఉన్నాయి. ఒప్పుకుంటే దాని పర్యవసానం నాకు తెలుసు. అది మరింత బాధాకరం.


ఓ పది రోజుల ముందు అమెరికాలో నివసిస్తూ ఉండే జనాలు భయపడే అర్ధరాత్రి ఫోన్ కాల్ రానే వచ్చింది.


 అమ్మ నుంచే. “నాన్న పోయారు రా. వెంటనే బయలు దేరు.” వీడియో కాల్ లో హృదయ విదారకంగా ఏడుస్తున్న అమ్మను చూస్తే ఏడుపొచ్చింది. మంచి తెలివి, పరిజ్ఞానం ఉన్న మనిషి, నాన్న లాంటి మనిషితో ఎలా బ్రతికుంది? ఇప్పుడెందుకు ఏడుస్తోంది? అమ్మ కోసమే ఆగ మేఘాల మీద మూడింతల డబ్బు పెట్టి ప్లేన్ టికెట్ కొని పాట్నా లో దిగాను. 


“నాన్న నాకేమి చేయలేదు. అస్సలు ఆయన నా జీవితంలో ఎక్కడున్నారు? ఎప్పుడూ బిజినెస్, రాజకీయాలు అంటూ జీవితమంతా ఇంటి బయటే గడిపేశారు. నీ బాధ చూడలేక నీ కోసం వచ్చాను. నేను వచ్చే ఆదివారం మళ్ళీ వెనక్కి వెళ్ళి పోతాను. నువ్వు కూడా నా తో పాటు వచ్చేయి. కొత్త దేశం, కొత్త మనుష్యులు - తొందరలోనే కోలుకుంటావు,” అన్నాను నేను కొంత సేపు తరువాత.


“అప్పుడప్పుడు షట్ డౌన్ అయ్యిపోతావు! నాన్న నీ కేమి చేయలేదా. చిన్నప్పుడు నీకు మతి తప్పిందని ఊరంతా చెప్తుంటే, నిన్ను దేశంలో ఉన్న పెద్ద డాక్టర్లకు ఎలా చూపెట్టగలిగాను? డిల్లీ ఎయిమ్స్(AIIMS) హాస్పిటల్ లో అపాయింట్మెంట్ దొరకడం ఎంత కష్టం. అలాంటిది, నువ్వు, నేను ఆ డిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ ల లో ఎలా రాజా మార్గం లో  అంత మంది పెద్ద, పెద్ద డాక్టర్ల ను కలువగలిగాము?”


అమ్మ అమెరికా రావడం గురించి మాట దాటేసింది. అమ్మ రావాలనుకున్న రాలేదని నాకు తెలుసు.


 మేము ప్రయాణిస్తున్న కారు వెనుక పది ఎస్ యూ వీ లు మాతో బాటు వస్తున్నాయి. అది మా నాన్న నాకిచ్చిన లెగసీ. నాన్న రాజకీయ వేత్త. రాష్ట్ర మంత్రు వర్గంలో చాలా ఏళ్లు పని చేశారు. 


“బాగా గుర్తుంది. ఆ హాస్పిటల్, ఆ సైకియాట్రిస్ట్ లను కలవడం ఎలా మార్చి పోగలను?  నా మాటలు నువ్వు కూడా వినలేదు కదమ్మా.”


“పూర్వ జన్మ జ్ఞాపకాలు వస్తున్నాయి అని ఒక సారి రాజు, మరో సారి సన్యాసి అని ఒక్కో ఆవతారం వేస్తూ కొత్త, కొత్త గొంతులలో అర్ధంకాని భాషలలో మాట్లాడుతుంటే అమ్మ నయినా నాకే భయమేస్తుండేది. ఇంకా నేనేమి వినాలి?”


“వినడం కంటే నమ్మకం అన్న పదం వాడుండాల్సిందేమో. నువనుకున్నట్లు ఆ డాక్టర్ లు నాకేమి నయం చేయలేదు. బహుశా నేనా అవకాశం కూడా ఇవ్వలేదనుకుంటా. అప్పుడు కూడా, నీ బాధ చూడ లేక నా మనస్సులోని మాటలు పంచుకోవడం మానేశా. మౌనం ఆశ్రయించా. అమెరికా పోయిన తరువాత నా కున్నది ‘మాల్ అడాప్టివ్ డే డ్రీమింగ్’ అని నిర్ణయించేశారు. వాళ్లకు కూడా నేనర్ధమైనట్లు లేదు...విజ్ఞాన శాస్త్రానికి అర్థం కాని విషయాలు, ఇంకా కొన్ని ఉన్నాయి…”


ఎదురుగా గ్రాండ్ ట్రంక్ రోడ్ మీద ప్రయాణిస్తున్నాము. వేగంగా పరిగెత్తుతున్న మా కారు వెనుక మరిన్ని కార్లు. కొండచిలువ తల లాగా  ఉంది మా కారు. తిని  మిగిలింది జీర్ణించుకునే వారి సైన్యం మా నాన్న జీవితాంతం ఉండేది. ఆయన చనిపోయిన తరువాత కూడా వెన్నెంటే ఉంది. ఆయన మీద ఉన్న విశ్వాసం వల్ల కాదు.ఆ తల పొజిషన్ నేనో, మా అమ్మ నో తీసుకుంటామన్న నమ్మకం.


పక్కన గంగా నది ప్రవహిస్తున్నది, పచ్చగా, ముదురు రంగుతో. నది మీద మరింత కాలుష్యం, మరి కొంత కాలుష్య నిర్మూలనానికి చేస్తున్న ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. రెండు వైపులా డబ్బులు చేసుకుంటున్నారు జనం.


 మనస్సు చివుక్కుమంది…


నది జబ్బు వాసన గుప్పున కొట్టింది…

***

గాలి లోని చెమ్మ లో హిమాలయాల నుండి మోసుకుని వస్తున్న గంగా నది సువాసనలు - నది వెంబడి నడుస్తున్న నన్ను సేద తీరుస్తున్నాయి. గంగమ్మ వల్ల,  నిండా పది అడుగులు కూడా తవ్వకుండానే తోడే మంచి నీరు మా దప్పిక తీరుస్తున్నది.  గంగమ్మ  ఆ చుట్టూ పక్క ప్రాంతాలను పచ్చగా మార్చివేసింది. 


అడవులు, మృగాలు మనుష్యులతో ఆనందంగా సహానివాసం చేస్తున్నాయి - ఒక మనిషి, మనిషి తో తప్ప. అదీ ఈ కళింగ యుద్ధం తరువాత మారాలి. ప్రపంచమంతా  శాంతి రాజ్యమేలాలి. 


నా వంటి మీద ఒక వస్త్రమే నా ఆచ్చాదన. ఆ వస్త్రం కూడా అక్కడక్కడ చినిగి ఉంది. చంకలో లో ఒక జోలె, అందులో ఒక బిక్ష పాత్ర. కాలికి చెప్పులు లేవు. చేతిలో కొన్ని ముత్యాలు, అస్థికలు - బుద్ధ భగవానుడివి.


మొన్ననే చూసినట్టుంది అమ్మని.

“చిన్న పిల్ల వాడివి. అప్పుడే ఈ సన్న్యసమేమిట్రా బాబు. మీ నాన్న ఆ కళింగ యుద్ధంలో వీరమరణం పొంది కొన్ని నెలలు కూడా కాలేదు,” అని కన్నీరు పెట్టుకుంది. బౌద్ధాశ్రమం లో చేరవద్దని గింజుకుంది. 


“సిద్ధార్థుడు పెళ్ళాం, పిల్లవాడికి చెప్పకుండానే ఇల్లు వదిలి పోయాడు. కనీసం నీకు నేను చెప్పి వెళ్తున్నాను కదా. నా ఆశయం ఆశ్రమం లో చేరడం. నాకు అనుమతి ఇవ్వు. నన్ను వదిలేయి,” అమ్మను అడుక్కోవడంతో నా సన్యాసాశ్రమం మొదలు పెట్టాను.


గత వారం సారంగనాథ్ లో విహరిస్తున్న లేళ్ళ మధ్య ఉన్న మా పంచ వర్గీయ భిక్షువుల సంఘ విహారంలో ఒక స్తూపం నిర్మించాలని చక్రవర్తి  అశోక మౌర్యుల వారు పాటలీ పుత్ర నగరానికి పిలిచారు. మా సంఘం నన్నూ చక్రవర్తి సభకు తీసుకెళ్లింది.


“మహేంద్ర, సంఘమిత్ర మీరు శాక్య ముని అస్థికలు దక్షిణాన ఉన్న లంకకు తీసుకెళ్లి బౌద్ధ మత గొప్పదనాని, శాంతి కాముకతను విస్తరించండి…,” అంటూ చక్రవర్తులు అస్థికలు అక్కడున్న రాజా వంశస్తులకు, బౌద్ధ బిక్షువ సంఘాలకు పంచడం మొదలెట్టారు. 


అలానే గౌతముడు మొదటి సారిగా బోధించిన పవిత్ర సారంగనాథ లో నిక్షేపించడానికి మాకు పచ్చ చలువ రాతిలో ఉంచిన అస్థికలు అందించారు.


ఆ అస్థికలు తిరుగు ప్రయాణంలో మోసే బాధ్యత, భాగ్యం నాకు దొరికింది. పాటలీ పుత్ర నుంచి సారంగనాథ వరకు పవిత్ర గంగా నది వెంటనే ప్రయాణం - కొంత పడవలో, మరికొంత ఆ నదీ తీరం పక్కన అశోకుడు చెట్లతో బాటు వేసిన బాట పై కాలి నడకన. 


గంగా నది జ్ఞాపకాలు  ఎంత తీయనివి. 

కొంత మంద్రంగా, కొంత కుప్పిగంతులతో, కొంత భయపడేంత ఉదృతంతో గంగా నది రూపాలు లెక్క లేనన్ని. 

అన్ని రూపాలు అందమే, 

ఆనందమే. ప్రకృతి వడిలోనుంచి ఇంకా దిగని ఆ నది, 

మనుష్యులు ఇంకా గౌరవించి, ఆరాధించే గంగా నది మా ప్రయాణ బడలికను సేద దీర్చి,మరిపించివేసింది.   


నాలుగు సింహాల తో కూడిన అశోక చక్రవర్తి రాజముద్ర స్తంభం, శిలా శాసనాలు,  స్తూపం - అన్ని స్థాపనలు నా కళ్ళెదురుగానే జరిగాయి. 


శాక్య ముని అస్థికల నిక్షేపణ ప్రయాణంలో నా - ఈ చేతుల ప్రేమేయం కూడా ఉండి ఉంది అంటే నా మనస్సు ఇప్పటికీ పులకరిస్తుంది…

***

“ఎంటలా వణికి పోతున్నావు. ఎంటా చిద్విలాసపు పిచ్చి నవ్వు!  అయినా డ్రైవర్ కు సారనాథ్ కు పొమ్మని ఎందుకు చెప్పావు. మీ నాన్న తర్పణం కాశీ లో అని నీకు తెలియదా? అమెరికా పోయి, అన్నీ మరచి పోయినట్లున్నావు,” అమ్మ ఆదిలింపు తో మళ్ళీ ఈ లోకంలో, ప్రస్తుతం లో మేలుకున్నాను.


ఎదురుగా టూరిస్ట్ లకని అందంగా లాండ్స్కేప్ చేసిన సారనాథ్ - యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ జాబితాలో చేర్పించడానికి ప్రభుత్వ పడుతున్న పాట్లు. 


నేను ఇహ లోకం రావడం చూసి, సంతోషించి, నా మౌనమే సమ్మతమనుకుని - కొండ చిలువ కాశీ దారి పట్టింది.


వెంటనే మళ్ళీ మా నాన్న గుర్తుకు వచ్చారు. గంగను అడ్డ దారులు పట్టించింది గుర్తుకు వచ్చింది. ఆయన హయాములో జరిగిన ఇసుక తవ్వకాల వల్లనే కదా గంగ దారి మార్చుకుని పాట్నా నగరానికి ఒక ఐదు కిలోమీటర్ల ఆవల ప్రవహించసాగింది, గంగా నది మంచాన పట్టడానికి దోహద పడింది.


‘మరీ మీ నాన్నను అంత తీసివేయొద్దు. ఆ ఇసుక మేటల వల్లే కదా ఎదురుగా గంగా నది నుండి కాశీ విశ్వేశ్వరుని కొత్తగా కట్టిన ఘాట్ దేదీప్యమానంగా వెలిగిపోతున్నది’, అంటూ ప్రభుత్వ టీ. వీ. చానెల్ యాంకర్ అరుపు, నాకు మాత్రమే, వినపడింది.


పాత రాజుల కట్టడాల మీద కొత్త రాజులు కట్టిన కొత్త కట్టడాలు - ఆలయాలపై మసీదులు, మసీదుల పై ఆలయాలు, అత్యంత ప్రాచీన కాశీ నగరం, కొత్త రంగుల దుస్తులతో, కొత్త మేక్ అప్ వేసుకుని - ప్రస్తుత యుగావతారంతో నా కళ్ళకు ప్రత్యక్ష మైంది. 


“ఈ తర్పణం చేయాల్సిందేనా? నేను వచ్చింది, నిన్ను ఓదార్చడానికి, వీలైతే నాతో తీసుకు పోవడానికి మాత్రమే,” మరో సారి అమ్మను వేడుకున్నాను.


“బాబూ ఈ చివరి కార్యం ఒకటి చేసి పో. మిగిలిన సాంవత్సరీకాలు, నా తంటాలు, అవి నేను ఇక్కడ పడతాను.”


“అంటే నువ్వు నాతో అమెరికాకు రాగూడదనే నిశ్చయించుకున్నావు.”


“ఇదిగో చూసావుగా, మన మీద ఎంత మంది ఆధార పడి ఉన్నారో. నాన్న వల్ల ఖాళీ అయ్యిన లోకసభ సీట్ కు నా పేరు, పార్టీ వాళ్ళు, ఖరారు చేయాలని పట్టు వాడుతున్నారు. నువ్వు ఈ ఒక్క కార్యక్రమం చేసి అమెరికా వెళ్ళిపో. నువ్వు నాకు తెలుసు. నిన్నాపను.”


“ఏమి చేయాలి?”


అమ్మ నాన్న అస్థికలు ఉన్న కుండ తన పక్కన ఉన్న సీటు లో నుంచి తీసి చూపెట్టింది.


లయన్ కింగ్ సినిమాలో సింబాను ఎత్తి చూపించినట్లనిపించింది. కాదంటే అది పుత్రోత్సాహం, ఇది జీవన సాఫల్య సంబరం.


 ఆ కుండను చూస్తుంటే కిటికీలోంచి, మా కారు వెనుక వస్తున్న కారు అద్దం నుండి ప్రతిఫలించి సూర్యకాంతి కళ్ళకు కొట్టింది. కళ్ళు బైర్లు తిరిగాయి…

***


“నీళ్లు, నీళ్లు, నీళ్లు…,” దప్పిక తో పిడచకట్టుకొని పోయిన నాలుకను పెగుల్చుకుని అరుస్తున్నాను. నేను ఎడారిలో లేను. నాకు నీళ్ళు దొరకక కాదు. ఎదురుగా నర్మదా నది ఉప్పొంగి పరిగెడుతున్నది. పైన ఎడతెరపి లేకుండా వర్షం. 


నా తీరని దాహానికి కారణం రుతుపవనాలతో పాటు వచ్చిన విసూచి వ్యాధి. శరీరాన్ని నదీ రహదారిగా మార్చివేసింది. ఏది త్రాగిన వంట్లో నిలవటం లేదు. వొళ్ళంతా వేడెక్కింది.


ఏ ప్రయత్నం చేయకుండానే దేవుడి ప్రార్థన శ్లోకాలు నాలుక వల్లె వేయడం మొదలెట్టింది. కనుచూపు దూరంలో మూతకు గుడ్డ కట్టిన కుండ, కుండలో నాన్న అస్థికలు.


పల్లవ రాజు పరమేశ్వర వర్మ చాళుక్య రాజు రెండవ విక్రమాదిత్య చేత యుద్ధంలో హత మార్చ బడ్డాడన్న మాట కాంచీపురవాసులను నిశ్చేష్టులుగా చేసింది.


“పోయింది మీ నాన్నగారు కదా. నీలో ఉలుకు లేదు, పలుకు లేదు. ఆయన పట్టపు రాణికి వారసులు లేకుండానే వెళ్లిపోయారు. రాణి వారు కూడా నువ్వు సింహాసనం అధిష్టించడానికి అంగీకరించారు. నువ్వెందుకు వద్దంటున్నావు?” అమ్మ మరోసారి నన్ను ఒప్పించే ప్రయత్నం మళ్ళీ మొదలుపెట్టింది.


“అమ్మా నీకు తెలియంది కాదు. మహారాజు గారు నిన్ను ఎప్పుడూ రాణి గా చూడలేదు. ఆయనకున్న భార్యలలో నువ్వు కూడా ఒకతి.  నన్నెప్పుడూ తన వారసుడుగా చూడలేదు, ప్రకటించలేదు. పైగా నన్ను కంచి దూరంగా ఉన్న తొండ నాడు లోని తిరుపతి కి పంపించేశారు.”


“కానీ ఆయన ఆ పని చేసిందాని వల్లే కదా,  నీకింత పేరు వచ్చింది. ఎన్ని కొత్త చెరువులు తవ్వి, కట్టించావు. ఎన్ని బీడు భూములు సస్యశ్యామలం చేశావు. అక్కడి ప్రజలందరూ, కృతజ్ఞతలతో నీ పేరు తలచి కానీ నోట్లో మెతుకు పెట్టుకోరు. నీవు ఒక రాజు లాగే ఏలావు. ఇప్పుడు చేయాల్సిందెల్లా తిరుపతి ప్రాంతం బదులు మొత్తం పల్లవ రాజ్యాన్ని ఏలడం. నువ్వు ఒక గొప్ప పల్లవ రాజవ్వుతావని నా గట్టి నమ్మకం.”


“పల్లవ రాజులు యుద్ధాల్లో కొల్లగొట్టిన సొమ్ము గుడులు కట్టడానికి, చెరువులు తవ్వడానికి ఉపయోగించడం గొప్ప విషయమే. రాజ్యం సుభిక్షంగా ఉంటే ప్రజలు రాజు పట్ల విధేయతతో,  విశ్వాసంతో  ఉంటారు. తిరుగుబాట్లు ఉండవు. కానీ ఈ నీరు రెండు వైపుల వాడి ఉన్న కత్తి. నేను రాజు ఆదేశాల మీద కట్టించిన చెరువులు వల్ల అనంతపుర ప్రాంతాలకు నీరు ప్రవహించడం ఆగిపోయింది. ఆ ప్రజలు పంట భూములు బీడులైయ్యాయి. కరువు కాటకాలు తో బాధ పడుతున్నారు. నీటికి, ప్రకృతికి సవతి బిడ్డలయ్యారు. అదీ నేను చేసిన ఘన కార్యం.”


“నీరు మన బలం.మన ఆయుధం. ప్రజల సముదాయానికి, వారి అభివృద్ధికి ఉపయోగించడం మన రాజ్యాన్ని ఐశ్వర్య సంపన్ను రాలిగా చేస్తుంది. అలానే ఆ నీటిని కట్టుబాటు చేయడం వల్ల మన పొరుగు దేశస్తులను నిర్వీర్యులుగా చేస్తుంది. ఆ నేర్పు నీకుంది. అందుకే పల్లవ రాజ్య సింహాసనం ఎక్కమంటున్నాను. మరిన్ని రాజ్యాలు గెలిచి ప్రజలకు మేలు చేయ వచ్చు.”


“నువ్వు అమాయకరాలివి అమ్మ.  ఇప్పుడే పట్టపు రాణి నివాసము నుండి వస్తున్నాను.  దాదాపు నూట యాభై  ఏళ్ళ క్రితం ఏలిన పల్లవ రాజు సింహ విష్ణు గుర్తుండే ఉంటుంది. ఆయన తమ్ముడు భీమ వర్మ ఆరోజుల్లోనే సముద్రయానం చేసి, కాంభోజ రాజ్యాన్ని గెలిచి అక్కడ రాజయ్యాడు. ఆయన వంశస్థులు ఇంకా  ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నారు. ఆ రాజుకున్న పుత్రులలో ఒకడు నిన్ననే ఆ దేశం నుండి మన దేశానికి బయలు దేరాడట. అతడు రెండవ నంది వర్మ గా పల్లవ సింహాసనాన్ని ఎక్కడానికి అన్ని సన్నాహాలు మొదలు పెట్టారని రాణి గారు తెలిపారు.”


“రాణి గారు అంత పని చేశారా. నువ్వే రాజని నిన్ను కూడా పలికింది. మరి నీ సంగతి ఏమి చేస్తుందట,” అమ్మ ఆక్రోశం ఆవేదనగా క్షణాలలో మారిపోతుంది.


“ గొప్ప పరాక్రమ వంతులైన  జ్ఞాతుల మధ్య యుద్ధం ఆపడం కోసం నీటి రహదారి పట్టి భీమ వర్మ,   ఎక్కడో ఉన్న కాంభోజ రాజ్యానికి రాజైతే, అదే నీటి రహదారి మీద, పట్టపు రాణి - రాజవంశ రక్తం కలుషితం కాకూడదని, ఒక కాంభోజ రాకుమారుణ్ణి కాంచీపుర సింహాసనం అధిరోహించడానికి ఆహ్వానించడం ఎంత విచిత్రం. పట్టపు రాణి నే నన్ను పిలిచి, నాన్న గారి అస్థికలు కాశీకి తీసుకెళ్లి పవిత్ర గంగా నదిలో కలపమని ఆదేశాలు ఇచ్చింది. నీటిలోనే పుట్టి నీటిలోనే నిమజ్జనం మన జీవితాలు,” నిర్వేదంతో అన్నాను నేను.


“ కాశీకి పోవడం కాటికి పోవడం ఒకటే కదరా. ఇది ఆ పట్టపు రాణి నిన్ను చంపడానికి వేసిన పథకమే. ఇప్పటికైనా ఆలస్యం కాలేదు. ప్రజలకి నువ్వంటే ఇష్టం. ఆ బాలరాజు కాంభోజ రాజ్యం నుంచి పడవ పట్టుకొని ఇక్కడకు వచ్చేసరికి  కొన్ని వారాలు పడుతుంది. నువ్వు అంతలో తిరుగుబాటు చేసి ఈ పల్లవ రాజు అయ్యి పోవచ్చు.ఈ అవకాశం వదలొద్దు,” అమ్మ అణుచుకోలేని కోపంతో అంది.


“అలా చేయడం నాకిష్టం లేదు. నా కోసం ప్రజలు తిరుగుబాటు లో చనిపోవడం ఇష్టం లేదు. ఒక వేళ రాజై నా,  ఉంపుడుగత్తె కొడుకన్న పేరు సమసిపోదు. నన్ను మన్నించు అమ్మ. కాశీకి పోయిన వారందరూ చనిపోరు. తిరిగి వచ్చిన వారు ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు.”


అలా నాన్న గారి అస్థికలు తీసుకొని, కొందరు పరిచారకులు, సైనికులతో కాశీ దారి పట్టాను. కొత్త రాజు పట్టాభిషేకం కోసం కూడా ఆగలేదు. 


నర్మదా నది తీరం చేరే సరికి ఋతుపవనాలు పుంజుకున్నాయి. ఒకటే వర్షాలు. దానితో బాటు విసూచి రోగాల విస్తరణ మొదలయ్యింది. మొదట ఒక సైనికుడితో మొదలయ్యి మొత్తం మా గుంపు కంతా వ్యాపించింది. నిన్నటితో సగం జనం వ్యాధితో పోయారు. నా పరిస్థితి విషమించింది.


తోటకూర లాగా వాలిపోతున్న చేతులతో అస్థికల కుండను ఎత్తడానికి చేస్తున్న నా వృధా   ప్రయత్నం…

***


“మళ్లీ ఎక్కడ పోయావు రా?” భుజం గట్టిగా కుదుపుతున్న అమ్మ. 


అమ్మ మరో చేతిలో నేను అప్పుడే చూసిన అస్థికల కుండా. 


“జెట్ లాగ్ ఇంకా పోయినట్లు లేదు,” అమ్మను బాధ పెట్టడం ఇష్టం లేక చెప్పాను. కానీ ఇక్కడకు వచ్చిన తరువాత ఇలా పాత జన్మలకు పోవడం ఎక్కువయ్యింది. అలా జరగ డానికి ట్రిగ్గర్ లు ఎక్కువ కనిపిస్తున్నాయి. 


“ఈ చివరి కార్యం చేసేయి నాన్న,” అంటూ కాశీలో గంగా నది ఒడ్డు మీదున్న మెట్ల మీద ఒక పూజారి ముందు కూర్చో బెట్టింది.


పూజారి  శ్లోకాలు వల్లవేయించి, కర్మ కార్యాలు ముగించి నన్ను కుండతో బాటు నది వైపు నడవమన్నాడు. 


ఎదురుగా ‘ఈ పని నా కోసమైనా చేయి నాన్న,’ అంటూ వేడుకుంటున్న కళ్ళు. 


అవే కళ్ళు! 


జన్మ, జన్మాలుగా నా బాగోగులు చూసుకుంటూ, నన్ను వెంటాడుతున్న అమ్మ ప్రేమ కళ్ళు. 


ప్రతీ జన్మలోనూ అమ్మ మాట వినలేదు. ఆవిడ కర్మ బంధానికి నేనే కారణమనిపించింది. 


నా నమ్మకాలను, నా మొరాలిటీ నీ పక్కకు పెట్టి  కుండలోని మొత్తం అస్థికలను గంగలో గుమ్మరించేశాను.


నన్ను, అమ్మను, పూజారిని, నాన్న అస్థికలను నది మధ్యకు తీసుకెళ్లిన పడవ తిరిగి ఒడ్డు వైపు మళ్లింది.


పడవకు ఒరుసుకున్న నీళ్లు గలగల చప్పుళ్లు చేస్తున్నాయి…..

కొంటె అమ్మాయి ఆపుకోలేని నవ్వులా…

**”

Feedback - Reader's comments

Drop us a line!

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.

Thanks for taking time to read the story

Love to hear your feedback on

Faint - కాశీ మజిలీ కథలు

  • Home
  • Stories
  • New Story
  • Faint
  • Novels
  • Essays
  • Cincinnati Chronicles
  • Art Gallery

My Dream Work

Copyright © 2026 My Dream Work - All Rights Reserved.

This website uses cookies.

We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

Accept